Flyover collapse: తమిళనాడులో కూలిన ఫ్లైవోవర్.. ఒకరు దుర్మరణం
Flyover collapse: తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైవోవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి

చెన్నై: తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైవోవర్ ఒక్కసారిగా కుప్పకూలింది ( Flyover collapse ). ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మధరై పట్టణంలో ఏడు కిలోమీటర్ల పొడవుతో ఒక ఫ్లైవోవర్ నిర్మాణం జరుగుతున్నది. శనివారం ఫ్లైవోవర్ కూలిన సమయంలో కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏడు కిలోమీటర్ల ఫ్లైవోవర్లో ఐదు కిలోమీటర్ల మేర కూలిపోయింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. మరోవైపు ఫ్లైవోవర్ కూలడానికి కారణం ఏమిటి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధిత అధికారులకు ద్వారా విచారణ చేయిస్తున్నది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లకు అడ్డంగా పడిన శిథిలాలను తొలగిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

