Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
Wife Stabs Husband’s Private Part | భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అతడి భార్య అనుమానించింది. దీనిపై గొడవ జరుగడంతో కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చింది. అది తాగి స్పృహ కోల్పోయిన భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో దాడి చేసింది.
లక్నో: భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు అతడి భార్య అనుమానించింది. దీనిపై గొడవ జరుగడంతో కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చింది. అది తాగి స్పృహ కోల్పోయిన భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో దాడి చేసింది. ( Wife Stabs Husband’s Private Part) ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైద్ గార్డెన్ ప్రాంతంలో నివసిస్తున్న దంపతులకు పిల్లలు లేరు. ఈ నేపథ్యంలో తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉన్నట్లు అతడి భార్య అనుమానించింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని భర్త అనుకుంటున్నట్లు భావించింది.
కాగా, అక్టోబర్ 8న ఆ భార్యాభర్తల మధ్య ఈ విషయంపై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భార్య కాఫీలో మత్తుమందు కలిసి భర్తకు ఇచ్చింది. అది తాగిన అతడు స్పృహ కోల్పోయాడు. దీంతో భార్య కత్తితో భర్త మర్మాంగంపై దాడి చేసింది. అతడి ప్రైవేట్ భాగాన్ని తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయింది.
మరోవైపు ఆ వ్యక్తి అరుపులు విన్న తల్లి, సోదరి హుటాహుటిన అతడి వద్దకు చేరుకున్నారు. గాయపడిన అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు రక్తస్రావాన్ని అరికట్టడానికి శస్త్రచికిత్స చేశారు. గాయపడిన ప్రైవేట్ భాగాన్ని బాగుచేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తి తన భార్యపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై ఆమెను విచారిస్తున్నారు. దర్యాప్తు ఆధారంగా ఆ మహిళపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

