న్యూఢిల్లీ, డిసెంబర్ 15: గుజరాత్లోని సూరత్ ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ హోదా లభించింది. సంబంధిత ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.
సూరత్ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వల్ల ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే కాక, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని, ప్రయాణికులకు మరింత సౌలభ్యం ఏర్పడటమే కాక, అంతర్జాతీయంగా ఇక్కడ నుంచి రవాణా సులభమవుతుందని అధికారి ఒకరు పేర్కొన్నారు.