పరీక్షల వల్ల ఒక్కరు మరణించినా.. కోటి పరిహారం ఇవ్వాలి : ఏపీకి సుప్రీం వార్నింగ్

న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ వార్నింగ్ ఇచ్చింది. 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్రం ఇప్పటి వరకు రద్దు చేయలేదు. పరీక్షలను నిర్వహిస్తామని కోర్టులో ఏపీ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే, దాని వల్ల ఒక్కరు మరణించినా.. కోటి పరిహారం ఇవ్వాలని కోర్టు తన తీర్పులో హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ఇలాంటి నిబంధన పాటిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం చెప్పింది. ఏపీలో బోర్డు పరీక్షలను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్లో కోర్టు ఈ హెచ్చరిక చేసింది.
మహమ్మారి వేళ పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుందని, దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని 5.2 లక్షల మంది విద్యార్థులను 34 వేల రూముల్లో ఎలా కూర్చోబెడుతారో వివరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. ప్రతి ఒక రూమ్‌లో కనీసం 18 మంది విద్యార్థులను కూర్చోబెట్టనున్నట్లు ఏపీ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. సెకండ్ వేవ్‌లో ఏం జరిగిందో చూశామని, పలు రకాల వేరియంట్లు దాడి చేస్తున్న సమయంలో మీరెందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారని కోర్టు అడిగింది. పరీక్షల నిర్వహణకు 15 రోజుల సమయం ఎలా సరిపోతుందని కోర్టు ప్రశ్నించింది.
జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారించింది. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు కేసు వాయిదా పడింది. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ మహఫూజ్ నజ్కీ వాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

