కొలీజియం సిఫారసుల ఆమోదంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుండటంతో అభ్యర్థుల సీనియారిటీ దెబ్బతింటున్నదని పేర్కొన్నది.
పదోన్నతి కోసం ముందుగా పంపిన సిఫారసులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. మద్రాస్ హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని నలుగురు జిల్లా జడ్జీల పేర్లను తాజాగా సిఫారసు చేసింది. ఇదే హైకోర్టుకు జడ్జిలుగా నియమించాలని జనవరిలో సిఫారసు చేసిన ఇద్దరు పేర్లనూ నోటిఫై చేయాలని సూచించింది.
‘మారిటల్ రేప్’ పిటిషన్లపై మే 9న విచారణ: సుప్రీం
మారిటల్ రేప్‌ను (భార్యకు ఇష్టంలేని శృంగారాన్ని) నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను మే 9న విచారిస్తామని సుప్రీంకోర్టు బుధవా రం తెలిపింది. ఇదే అంశంపై గత ఏడాది ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పు లు వెలువరించింది.