Sambhal Mosque Survey: సంభల్ మసీదులో సర్వేపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Sambhal Mosque Survey : సంభల్ మసీదు సర్వే కేసులో.. ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. శాంతి, సామరస్యాన్ని పాటించాలని సుప్రీం తెలిపింది.
న్యూఢిల్లీ: యూపీలోని సంభల్‌లో ఉన్న షాహీ ఈద్గా మసీద్‌లో సర్వే(Sambhal Mosque Survey) చేపట్టేందుకు స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఆ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు కమిటీకి ఇవాళ సుప్రీంకోర్టు సూచించింది. షాహీ ఈద్గా మసీదు వద్ద గతంలో హరిహర హిందూ దేవుళ్ల ఆలయం ఉన్నట్లు వేసిన పిటీషన్ ఆధారంగా సర్వే చేపట్టేందుకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఆ కేసులో స్పందిస్తూ.. శాంతి, సామరస్యాన్ని పాటించాలని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో కోరింది.
ఈ కేసులో హైకోర్టు వాదనలు వినేంత వరకు.. ట్రయల్ కోర్టు ఆదేశాలను అమలు చేయరాదు అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ కేసును పెండింగ్‌లో పెడుతున్నామని, అక్కడ ఏమీ జరగాల్సిన అవసరం లేదని, మనం తటస్థంగా ఉండాలని, అక్కడ ఏమీ జరగకుండా చూడాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. ఈ కేసును హైకోర్టు సమీక్షించేంత వరకు.. జనవరి 8వ తేదీన జరగాల్సిన ట్రయల్‌కోర్టు విచారణ కూడా జరగదని సుప్రీం చెప్పింది. మసీదులో సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వారం క్రితం సంభల్‌లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. స్థానికులు, పోలీసుల మధ్య హింస చోటుచేసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- harmony
- Mosque Survey
- peace
- Sambhal
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

