Supreme Court | సందేశ్‌ఖాలీ కేసుపై ‘సుప్రీం’ స్టే.. లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసులు..!
Supreme Court | పశ్చిమ బెంగాల్లో సంచనం సృష్టించిన సందేశ్‌ఖాలీ కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. లోక్‌సభ సెక్రటేరియట్‌తో పాటు కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Supreme Court | పశ్చిమ బెంగాల్లో సంచనం సృష్టించిన సందేశ్‌ఖాలీ కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. లోక్‌సభ సెక్రటేరియట్‌తో పాటు కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సందేశ్‌ఖాలీలో కొద్దిరోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు సుకాంత మజుందార్‌తో పాటు బీజేపీ ఎంపీలు బాధితులను కలిసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు సందేశ్‌ఖాలీ వెళ్లకుండా ఎంపీలను అడ్డుకున్నారు.
పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగిన సమయంలో సుకాంత మజుందార్‌కు గాలయ్యాయి. పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆయన లోక్‌సభ సెక్రటేరియట్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ప్రివిలేజెస్ కమిటీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం (ఫిబ్రవరి 19న) కమిటీ ఎదుట విచారణకు కావాలని ఆదేశింది. ప్రివిలేజెస్ కమిటీ విచారణను సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నోటీసులపై స్టే విధించింది. ఈ సందర్భంగా లోక్‌సభ సెక్రటేరియట్, కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లో స్పందన తెలుపాలన్న ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

