ఏపీలో మున్సి‘పోల్స్’కు బ్రేక్
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఈ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా ప్రకటించారు. మొత్తంగా 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ఎస్ఈసీ తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్లనున్నట్టు చెప్పారు.
- తాత్కాలికంగా 100 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిపివేత
- సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీఅనిల్చంద్ర పునేఠా ప్రకటన
- అభ్యర్థుల తుది జాబితా ప్రకటన 25 వరకు వాయిదా
ఢిల్లీ/ హైదరాబాద్, (నమస్తే తెలంగా ణ): ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఈ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా ప్రకటించారు. మొత్తంగా 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ఎస్ఈసీ తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్లనున్నట్టు చెప్పారు. సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు వచ్చాక గురువారం ఉత్తర్వులు జారీచేయనున్నట్టు వెల్లడించారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువును పొడిగించాలన్న వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. తమ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని వైసీపీ ఆ పిటిషన్లో పేర్కొన్నది. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ జాయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహన్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల ప్రక్రియకు రాజ్యాంగ విరుద్ధమైన లేదా చట్టవిరుద్ధమైన చర్యల ద్వారా విఘాతం కలిగినప్పుడు న్యాయస్థానాలు చేతులు కట్టుకుని ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సి ఉన్నదని, ఈ అవకాశాలకు బలప్రయోగం, బెదిరింపుల్లాంటి చర్యలతో భంగం కలిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని తేల్చిచెప్పింది. ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కల్పించడం అత్యంత కీలకమని వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం నిర్వర్తించాల్సిన ఈ రాజ్యాంగబద్ధమైన ఈ బాధ్యతకు హింస, బలప్రయోగం కారణంగా ఆటంకాలు ఏర్పడి, అభ్యర్థులకు సమాన అవకాశాలు దెబ్బతిన్నప్పుడు న్యాయ సమీక్షాధికారాన్ని పూర్తిగా పకనపెట్టలేమని పేర్కొన్నది.
నామినేషన్ల దాఖలు గడువు పొడిగించాలన్న వైసీపీ అభ్యర్థనను పరిశీలించి ఈ నెల 22లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి సదరు మున్సిపాలిటీల్లో 48 గంటలపాటు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించాలని ఏపీ ఎస్ఈసీకి స్పష్టం చేసింది. జిల్లా కేంద్రాల్లో నామినేషన్లపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని, అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 25కు వాయిదా వేయాలని సూచించింది. అభ్యర్థులకు తగిన పోలీస్ రక్షణ కల్పించాలని, నామినేషన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతతోపాటు సీసీటీవీ ఏర్పాట్లు చేయాలని ఏపీ డీజీపీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

