Supreme Court | బుల్డోజర్ న్యాయమంటే.. చట్టాలను తుంగలో తొక్కడమే: సుప్రీంకోర్టు
బుల్డోజర్ న్యాయంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాల పేరుతో ప్రజల ఇండ్లపైకి ప్రభుత్వాలు బుల్డోజర్లను పంపిస్తుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. క్రిమినల్ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉండటం ఆ నిందితుల ఇండ్ల కూల్చివేతకు తగిన కారణం కాబోదని స్పష్టం చేసింది.
- నిందితుల ఇళ్లను కూల్చడం సరికాదు
Supreme Court | న్యూఢిల్లీ : బుల్డోజర్ న్యాయంపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాల పేరుతో ప్రజల ఇండ్లపైకి ప్రభుత్వాలు బుల్డోజర్లను పంపిస్తుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. క్రిమినల్ కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉండటం ఆ నిందితుల ఇండ్ల కూల్చివేతకు తగిన కారణం కాబోదని స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలను దేశ చట్టాలను తుంగలో తొక్కడంగా పరిగణించవచ్చునని హెచ్చరించింది. గుజరాత్‌లోని ఖేదా జిల్లాకు చెందిన జావేద్ అలీ మెహబూబామియా సయీద్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఈ హెచ్చరిక చేసింది. సయీద్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కఠ్లాల్ గ్రామ రెవిన్యూ రికార్డుల ప్రకారం తన క్లయింటు ఓ భూమికి సహ యజమాని అని చెప్పారు. ఆ భూమిలో ఇంటిని నిర్మించుకోవడానికి గ్రామ పంచాయతీ 2004లో అనుమతి ఇచ్చిందన్నారు.
రెండు దశాబ్దాల నుంచి మూడు తరాలు ఆ ఇంటిలో నివసిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఈ నెల 2న జారీ చేసిన ఇండ్ల కూల్చివేత కోసం అనుసరించవలసిన మార్గదర్శకాలను కూడా ప్రస్తావించారు. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం స్పందిస్తూ, ప్రభుత్వాల చర్యలు చట్టాలకు అనుగుణంగా ఉండవలసిన దేశంలో, ఓ కుటుంబంలోని ఓ వ్యక్తి ఏదైనా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండటాన్ని కారణంగా చూపించి, ఆ కుటుంబంలోని ఇతర వ్యక్తులకు, వారు చట్టబద్ధంగా నిర్మించుకున్న ఇంటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. నేరంలో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఆ నిందితుని ఇంటిని కూల్చివేయడానికి తగిన కారణం కాబోవని వివరించింది. సయీద్‌పై కేసు న్యాయస్థానంలో రుజువు కావలసి ఉందని తెలిపింది. చట్టమే సర్వోన్నతమైన దేశంలో ఇటువంటి కూల్చివేత బెదిరింపులను చూసీచూడనట్లు కోర్టు ఉండటం సాధ్యం కాదని చెప్పింది. ఇటువంటి చర్యలను చట్టాలపైకి బుల్డోజర్లను తోలడంగా పరిగణించవచ్చునని తెలిపింది. సయీద్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని గుజరాత్ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సయీద్ ఇంటిని కూల్చవద్దని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

