ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను ఇంకా వాడుతున్నారా?

న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఏ సెక్షన్‌ను 2015వ సంవత్సరంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2000 సంవత్సరంలో రూపొందించిన ఆ చట్టాన్ని ఇంకా కొన్ని కేసుల్లో నమోదు చేస్తున్నారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఐటీ యాక్ట్‌లోని 66ఏ సెక్షన్‌ను ఎప్పుడో రద్దు చేశారని, మరెందుకు ఆ సెక్షన్ ప్రకారం ఇంకా కేసులు నమోదు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఈ పరిణామాలు దారుణంగా ఉన్నాయని సుప్రీం విస్మయాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ రోహింటన్ నారీమన్, కేఎం జోసెఫ్, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌పై విచారణ చేపడుతూ.. రద్దు అయిన ఆ చట్టం గురించి దేశంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లకు తెలియజేయాలని తన తీర్పులో కేంద్రాన్ని ఆదేశించింది. 2015 మార్చి 24వ తేదీన ఓ తీర్పులో ఐటీయాక్ట్‌లోని 66ఏ సెక్షన్‌ను రాజ్యాంగవ్యతిరేకమని కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ చట్టం కింద దేశవ్యాప్తంగా 745 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

