Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Supreme Court : సర్‌లో అవకతవకలపై ఇండియా బ్లాక్ కూటమి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది.
Supreme Court : సర్‌లో అవకతవకలపై ఇండియా బ్లాక్ కూటమి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు విచారణకు స్వీకరించింది. తాజాగా ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు, అలాగే ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషికి సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తోంది.
దీనిలో భాగంగా గత సోమవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సుప్రీంకోర్టు వరకు నిర్వహించిన మార్చ్‌పై సుప్రీం బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ తాను సుప్రీంకోర్టు వరకు చేపట్టిన ర్యాలీపై తప్పనిసరిగా వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. ఎవ్వరూ న్యాయవ్యవస్థను బెదిరించలేరని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లో ఒకరి తరఫున తాత్కాలికంగా విచారణ చేపడతున్నామని, అయినప్పటికీ రాహుల్ గాంధీ తన ప్రవర్తనకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇదే సమయంలో జంతర్ మంతర్ అంశంపై కూడా కోర్టు స్పందించింది. జంతర్ మంతర్‌ను నిరసనల ప్రదేశ జాబితా నుంచి ఢిల్లీ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన కోర్టు.. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించాలనుకున్నారు. దీంతో ఆ ప్రదేశాన్ని నిరసన ప్రదేశంగా తొలగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీజేపీ తరఫును సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జంతర్ మంతర్‌ను తిరిగి నిరసన ప్రదేశంగా మార్చాలని ఆ పిటిషన్లో కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అంతకుముందు.. సర్‌లో అవకతవకలు, సీఈసీ రాజీనామా అంశాలపై రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

