UAPA Case | న్యూస్‌క్లిక్ కేసులో ఢిల్లీ పోలీసులకు ‘సుప్రీం’ నోటీసులు
UAPA Case | ఢిల్లీ పోలీసులకు గురువారం సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఉపా (UAPA) కేసులో అరెస్టయిన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరిపింది.
UAPA Case | ఢిల్లీ పోలీసులకు గురువారం సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఉపా (UAPA) కేసులో అరెస్టయిన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. పురకాయస్థ, అమిత్ చక్రవర్తి తరఫు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, దేవదత్ కామత్ సుప్రీంకోర్టుల పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు జైలులో ఉన్నారని, సత్వరమే పిటిషన్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు.
పిటిషన్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నెల 30లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు పోలీసులకు జారీ నోటీసుల్లో ఆదేశించింది. కోర్టు ఇంతకుముందు కేసును 16న విచారించేందుకు అంగీకరించింది. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ నమోదు చేసిన ఉపా (UAPA) కేసులో అరెస్ట్, రిమాండ్ సవాల్ చేస్తూ ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యూస్‌క్లిక్ ఓ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్. విదేశీ నిధుల నిధుల వ్యవహారంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

