గాలిపై విచారణేది?
గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసి పన్నెండేండ్లు గడిచినా కేసు విచారణ జరగకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
- 12 ఏండ్లు దాటినా ట్రయల్ జరగకపోవటమా?
- గనుల అక్రమ తవ్వకాల కేసు విచారణపై సుప్రీం అసహనం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసి పన్నెండేండ్లు గడిచినా కేసు విచారణ జరగకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయటమేనని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి ధర్మాసనం వ్యాఖ్యానించింది. గాలి జనార్దన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ వివరాలు అందించాలని, విచారణ ఏ దశలో ఉన్నది? ఏ కారణాలతో ఆలస్యం అవుతున్నది? తదితర వివరాలపై నివేదికను ఈ నెల 19లోపు సీల్డ్ కవర్లో అందజేయాలని హైదరాబాద్ సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిని ఆదేశించింది.
తీవ్రమైన అభియోగాలున్న ఈ కేసులో 12 ఏండ్ల తర్వాత కూడా విచారణ జరగకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నది. తనకు 2015 జనవరిలో మంజూరు చేసిన బెయిల్ షరతులను సడలించాలని గాలి జనార్దన్‌రెడ్డి 2020లో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించాలని, బెయిల్ షరతులు సడలిస్తే విచారణ పురోగతిపై ప్రభావం పడుతుందని, సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా వాదించారు. దీంతో కేసు విచారణ పురోగతి వివరాలు తెలిశాక నిర్ణయం తీసుకొంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

