Supreme Court | న్యూఢిల్లీ: ఒక మహిళ గర్భ విచ్ఛిత్తికి సంబంధించి సుప్రీం కోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు విభిన్న తీర్పులు ప్రకటించారు. ఒక మహిళ 26 వారాల గర్భ విచ్ఛిత్తికి తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా స్పందించారు.
గర్భ విచ్ఛిత్తి అనుమతికి అయిష్టత చూపుతూ ఒక జడ్జీ, ఆ మహిళ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలంటూ మరో జడ్జీ విభిన్న తీర్పులు చెప్పారు. ‘మహిళ గర్భంలోని పిండం గుండె చప్పుడు నిలిపివేయాలంటూ ఏ న్యాయస్థానం తీర్పు చెబుతుంది?’ అని జస్టిస్ హిమా కోహ్లీ పేర్కొన్నారు. ‘ఆమె నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందే’ అంటూ జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నారు. దీనిని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలంటూ ఇరువురు జడ్జీలు నిర్ణయించారు.