Demonetisation: నోట్ల రద్దును సమర్ధించిన సుప్రీంకోర్టు
Supreme Court on demonetisation: కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. 2016లో కేంద్ర ప్రభుత్వం వెయ్యి, 500 నోట్లను రద్దు చేసింది. అ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. 2016లో కేంద్ర ప్రభుత్వం వెయ్యి, 500 నోట్లను రద్దు చేసింది. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యలు ధర్మాసనం నోట్ల రద్దును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్న, వీ సుబ్రమణియన్, బీవీ నగరత్న ఉన్నారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర సర్కార్ తీసుకున్నంత మాత్రాన దాన్ని తప్పుపట్టలేమని సుప్రీం బెంచ్ తన తీర్పులో అభిప్రాయపడింది. నలుగురు సభ్యులు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు. జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం మెజారిటీకి వ్యతిరేంగా తన అభిప్రాయాల్ని తీర్పులో వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా కాకుండా పార్లమెంట్ ద్వారా ఆ చర్య చేపడితే బాగుండేదని జస్టిస్ బీవీ నాగరత్న తెలిపారు.
మెజారిటీ న్యామూర్తుల అభిప్రాయాన్ని జస్టిస్ గవాయి వినిపించారు. ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే సమయంలో.. చాలా సంయమనం అవసరమని ఆయన అన్నారు. న్యాయ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ అభిప్రాయాలు ముడిపెట్టలేమన్నారు. నోట్ల రద్దు అంశంపై కేంద్రం, ఆర్బీఐ మధ్య ఆరు నెలల పాటు సంప్రదింపుల ప్రక్రియ సాగిందన్నారు. నోట్ల రద్దు ప్రక్రియను చేపట్టే వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్బీఐకి లేదని జస్టిస్ గవాయి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

