Ilaiyaraaja: కాపీరైట్ కేసు.. ఇళయరాజా పిటీషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
Ilaiyaraaja: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 536 పాటలకు చెందిన కాపీరైట్ కేసును బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరించింది.
న్యూఢిల్లీ: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilaiyaraaja) వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సంగీతానికి సంబంధించిన 536 వర్క్స్ అంశంలో ఇళయరాజా కాపీరైట్ కేసు వేశారు. అయితే బాంబే హైకోర్టులో ఉన్న ఆ కేసును మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు. ఆ పిటీషన్‌ను ఇవాళ సుప్రీం తిరస్కరించింది. సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్, ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్‌ను డిస్మిస్ చేసింది.
మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సుమారు 1500 చిత్రాలకు 7500 పాటలు కంపోజ్ చేశారు. అయితే ఇళయరాజాకు చెందిన మ్యూజిక్ ఎన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ వద్ద ఉన్న 536 పాటలను అక్రమంగా వాడుకుంటున్నట్లు సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఇండియా సంస్థ ఆరోపించింది. ఈ నేపథ్యంలో 2022లో బాంబే హైకోర్టు కేసు దాఖలు చేసింది. ఆ 536 పాటలను ఓరియంటల్ రికార్డ్స్ ఎకో రికార్డింగ్ నుంచి తీసుకున్న సోనీ కంపెనీ చెప్పింది. అయితే ఆ మ్యూజిక్ వర్క్స్ విషయంలో కేసు దాఖలు చేసిన ఇళయరాజా.. పిటీషన్‌ను మద్రాసు హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. సోనీ సంస్థ క్లెయిమ్ చేస్తున్న 536 పాటల్లో 310 పాటలపై మద్రాసు హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు.
ఇళయరాజా కంపెనీ తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారణన్తో పాటు అడ్వకేట్ ఉత్సవ్ త్రివేది వాదిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

