Diabetes | దేశంలో భారీగా పెరిగిపోతున్న డయాబెటిక్ రోగులు.. మందుల కోసమే ఆదాయంలో 25 శాతం కట్
భారత్‌పై ‘షుగర్' బాంబు పడబోతున్నది. డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వేరుపురుగులా తొలుస్తున్నది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సగటున 25 శాతం ఔషధాలు, వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు.
- అదే స్థాయిలో పెరుగుతున్న వైద్య ఖర్చులు
- 9 శాతం వృద్ధితో టాప్ 2లో షుగర్ మందుల రంగం
- రోగుల్లో తగ్గిపోతున్న పని, ఆలోచనా సామర్థ్యం
- ఈ రకంగానూ దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమే
- దేశంలో ఇప్పటికే పది కోట్లు దాటిన షుగర్ రోగులు
- వచ్చే మూడేండ్లలో మరో 13 కోట్ల మందికి వ్యాధి
- పరిస్థితి చేయిదాటిపోతున్నదని వైద్యుల ఆందోళన
- ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని విన్నపాలు
Diabetes | న్యూఢిల్లీ: భారత్‌పై ‘షుగర్’ బాంబు పడబోతున్నది. డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వేరుపురుగులా తొలుస్తున్నది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సగటున 25 శాతం ఔషధాలు, వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో 25 ఏండ్ల లోపువారికి కూడా డయాబెటిస్ వస్తున్నదని అనేక సర్వేల్లో తేలటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. డయాబెటిక్ రోగుల్లో పని సామర్థ్యం తగ్గిపోవటమే అందుకు కారణం. దేశంలో ఇప్పటికే డయాబెటిక్ రోగులు పది కోట్లు దాటారు. మరో మూడు నాలుగేండ్లలో వీరికి మరో 13 కోట్ల మంది జత కలుస్తారని ఐసీఎంఆర్ 12 ఏండ్లపాటు నిర్వహించిన పరిశోధనలో తేల్చింది. డయాబెటిక్ రోగులకు తోడు దేశంలో 30 కోట్లకుపైగా బ్లడ్ ప్రెషన్ (బీపీ) రోగులున్నారు. దీంతో దేశంలో పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉన్నదని, ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
భారీగా రోగులు
మనదేశంలో 2022 నాటికి 10.01 కోట్ల డయబెటిస్ రోగులున్నారు. డయాబెటిస్‌పై ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. దీంతో ఆ మహమ్మారి బారిన పడిన విషయం కూడా తెలియకుండా చాలామంది జీవితాలను కొనసాగిస్తున్నారు. వ్యాధి ముదిరి కండ్లు, గుండె, మూత్రపిండాలను దెబ్బతీసిన తర్వాతగానీ అసలు కారణం తెలుసుకోలేకపోతున్నారు. దీనివల్ల వైద్య ఖర్చుల భారం మరింత పెరుగుతున్నదని నిపుణులు చెప్తున్నారు.
ఏటా కరిగిపోతున్న లక్షల కోట్లు
డయాబెటిస్ వల్ల పౌరుల ఆరోగ్యంతోపాటు డబ్బుకూడా కరిగిపోతున్నది. ప్రపంచంలో డయాబెటిస్ రోగులు తమ వైద్యం, ఔషధాల కోసం చేస్తున్న వ్యయం విషయంలో అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. జర్నల్ ఆఫ్ హెల్త్ ఎకనామిక్స్ అండ్ ఔట్‌కమ్స్ రిసెర్చ్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం భారత్‌లో 2017లోనే డయాబెటిస్ వైద్యం కోసం రూ.2.54 లక్షల కోట్లు ఖర్చు చేశారు. దేశీయ డయాబెటిక్ మందుల మార్కెట్ విలువే రూ.16,769 కోట్లు ఉన్నది.
పరిస్థితి తీవ్ర ఆందోళనకరం
డయాబెటిస్ బారిన పడినవారికి దీర్ఘకాలంలో కంటి, గుండె, మూత్రపిండాలు, కొలెస్టరాల్, హైపర్‌టెన్షన్ సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీంతో రోగులు చేయాల్సిన వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోవటమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో పౌరుల సగటు పని సామర్థ్యం దారుణంగా పడిపోతుంది. అందువల్ల దీనిని ఇక ఎంతమాత్రమూ వ్యక్తుల సమస్యగా చూడలేమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని వ్యాధి నిర్ధారణ, నివారణ, వైద్య సేవలు ప్రారంభించాలని సూచిస్తున్నారు. వీటితోపాటు డయాబెటిస్‌కు రోగులకు ప్రమాదరకంగా మారే జంక్ ఫుడ్, శీతల పానియాలపై పన్నులు పెంచాలని, రోగులకు ఉపయోగపడే చిరుధాన్యాల వంటి ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కోరుతున్నారు.
ఒక్కో రోగికి రూ.40 వేలు ఖర్చు
భారత్‌లో డయాబెటిక్ రోగులు వైద్యం, మందుల కోసం ఏటా చేస్తున్న ఖర్చు ప్రాంతాన్ని బట్టి మారుతున్నది. ప్రత్యక్షంగా నార్త్‌జోన్‌లో ఏటా రూ.18,890 ఖర్చు చేస్తుండగా, ఇది సౌత్జోన్లో రూ.10,585 ఉన్నది. అతి తక్కువగా వెస్ట్ జోన్లో రూ.8,822 ఖర్చు చేస్తుండగా, నార్త్ ఈస్ట్ జోన్లో అత్యధికంగా రూ.45,792 ఖర్చు చేస్తున్నారు. పరోక్షంగా నార్త్‌జోన్‌లో రూ.18,146 ఖర్చు చేస్తుండగా, సౌత్జోన్లో రూ.18,198, వెస్ట్ జోన్లో రూ.3,949, నార్త్ ఈస్ట్ జోన్లో రూ.18,707 ఖర్చు పెడుతున్నారు. వ్యాధి నిర్ధారణ, వైద్యం, వ్యాధి రాకుండా తీసుకొనే ముందస్తు చర్యలు, రోగుల కోసం తీసుకొనే ప్రత్యేక శ్రద్ధ తదితర వాటి కోసం చేసే ఖర్చును ప్రత్యక్ష ఖర్చుకింద చూపుతున్నారు. అనారోగ్యం వల్ల ఉద్యోగాలకు తరుచూ సెలవులు పెట్టడం, పని సామర్థ్యం తగ్గిపోవటం, శాశ్వత వైకల్యం వంటివి పరోక్ష వ్యయం కింద చూపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

