Sudha Murty: రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి ప్రమాణ స్వీకారం
Sudha Murty: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి ఇవాళ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారంచేశారు. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ తన ఛాంబర్లో ఆమె చేత ప్రమాణం చేయించారు.
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి(Sudha Murty) ఇవాళ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారంచేశారు. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ తన ఛాంబర్లో ఆమె చేత ప్రమాణం చేయించారు. లీడర్ ఆఫ్ ద హౌజ్ పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుధా మూర్తి వయసు 73 ఏళ్లు. ఇన్ఫోసిస్‌లో మాజీ చైర్మెన్‌గా చేశారు. అనేక పుస్తకాలు రాశారామె. ఎక్కువగా చిన్న పిల్లలపై పుస్తకాలు రాశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత శుక్రవారం రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేశారు. కన్నడ, ఆంగ్ల సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాహిత్య అకాడమీ బాల్ సాహిత్య పురస్కార్ అందుకున్నారు. 2006లో ఆమెకు పద్మశ్రీ అందజేశారు. 2023లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. టెల్కో కంపెనీలో పనిచేసిన తొలి మహిళా ఇంజినీర్‌గా సుధామూర్తికి గుర్తింపు ఉన్నది. ఇన్ఫోసిస్ మొదలుపెట్టేందుకు తన ఎమర్జెన్సీ ఫండ్ నుంచి ఆమె పదివేలు తీసి భర్తకు ఇచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీ విలువ సుమారు 80 బిలియన్ల డాలర్లు. సుధా మూర్తి కుమార్తె అక్షత .. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్‌ను పెళ్లి చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

