Sudha Murty | ఇదో కొత్త బాధ్యతగా భావిస్తున్నా.. రాజ్యసభకు నామినేట్ కావడంపట్ల సుధామూర్తి రియాక్షన్
Sudha Murty | తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు.
Sudha Murty | తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ అవకాశం కల్పించడం తనకు ఇచ్చిన పెద్ద బహుమతి అని.. దేశం కోసం పనిచేయడం కొత్త బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu).. సుధామూర్తిని ఎగువ సభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషకరమైన విషయమన్నారు. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనదని ప్రశంసించారు. సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనం అని కొనియాడారు. ఈ నేపథ్యలో ప్రధాని మోదీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read..
Sudha Murty | రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి.. నారీ శక్తికి నిదర్శనం అంటూ మోదీ ట్వీట్
Rupert Murdoch | లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఐదో పెళ్లికి సిద్ధమైన 93 ఏళ్ల బిలియనీర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

