Su-30 MKI : భారత వైమానిక దళానికి వెన్నుదన్నుగా నిలిచేవి సుఖోయ్ యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు. ఈ రెండింటినీ కలిపి ప్రయోగిస్తే తిరుగే ఉండదు. అందుకే ఇప్పుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అదే పని చేసింది. 94వ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా సుఖోయ్ యుద్ధ విమానమైన సు-30ఎంకేఐ విమానానికి బ్రహ్మోస్ క్షిపణిని జత చేశారు.
హిండన్ ఎయిర్‌బేస్ నుంచి ఈ విమానాన్ని ప్రదర్శించారు. విమానం కింది భాగంలో బ్రహ్మోస్ క్షిపణి ఉన్న వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి. అత్యంత ప్రభావవంతమైన విమానం, క్షిపణి కలిస్తే మన వాయుసేన బలం మరింత పెరుగుతుంది. ఈ క్షిపణి కలిగిన విమానం 400 కిలోమీటర్ల సామర్ధ్యం కలిగి ఉంది. ఇంతకుముందు ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్‌పై దాడి చేసేందుకు ఈ రెండింటినీ కలిపి ప్రయోగించారు. ఇది విజయవంతమైంది. హిండన్ ఎయిర్‌బేస్ వద్ద స్కాల్ప్, మికా, మెటియోర్, ఆకాష్ మిస్సైల్స్ క్షిపణులు కలిగిన రాఫెల్ యుద్ధ విమానాల్ని కూడా ప్రదర్శనకు ఉంచారు.
ఎల్సీహెచ్ ప్రచండ్, తేజాస్, రోహిణి రాడార్ వంటి వాటిని కూడా ప్రదర్శనకు ఉంచారు. మన వైమానిక సామర్ధ్యాన్ని చాటి చెప్పేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. లాంగ్ రేంజ్ ట్విన్ ఇంజిన్ కలిగిన సుఖోయు విమానాలు అన్ని రకాల వాతావరణాల్లోనూ పని చేయగలవు. వీటిని రష్యాకు చెందిన సుఖోయ్ సంస్త రూపొందిస్తే.. ఇండియాలోని హెచ్ఏఎల్ సంస్థ తయారు చేసింది.