National
- Dec 05, 2020 , 17:22:14
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
‘కాంగ్రెస్ నాయకత్వంపై వ్యాఖ్యలు ఆపండి’

ముంబై: మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై వ్యాఖ్యలు ఆపాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి యశోమతి ఠాకూర్ అన్నారు. కూటమి ప్రాథమిక నియమాలకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలన్నారు. తమ పార్టీ నాయకత్వం బలంగా, స్థిరంగా ఉన్నదని చెప్పారు. ప్రజాస్వామ్యం విలువలపై నమ్మకం వల్లనే మహారాష్ట్ర వికాస్ అగాడి (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో స్థిరత్వం లోపిస్తున్నట్లుగా కనిపిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇటీవల మరాఠి ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడంపై యశోమతి శనివారం స్పందించారు. ఆ ఇంటర్వూతోపాటు, కూటమిలోని శివసేన నేతల ఆర్టికల్స్‌ను జత చేస్తూ ఇంగ్లీష్, మరాఠీలో ఈ మేరకు ట్వీట్ చేశారు.
తాజావార్తలు
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్‌లో భారీ హింస
- ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్
- కూతుళ్ల హత్య కేసు.. తల్లికి వదలని క్షుద్రపిచ్చి..
- మన చరిత్ర సుధీర్ఘమైనది.. భారత్‌కు సందేశంలో ఆస్ట్రేలియా ప్రధాని
- దేశానికి బలమవుదాం.. కోహ్లి, రహానే రిపబ్లిక్ డే విషెస్
- అటవీశాఖ ఉద్యోగులకు పీసీసీఎఫ్ ప్రశంస
- చరిత్రలోఈరోజు.. రాజ్యంగం అమలులోకి వచ్చిన రోజు
- కూతుళ్ల హత్య కేసు.. తల్లీదండ్రులు అరెస్ట్
- వ్యాక్సిన్ సామర్థ్యంపై ఆస్ట్రాజెనెకా వివరణ
- మా నాన్నకు పద్మ అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్స్
MOST READ
TRENDING