శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 10:17:40

క‌ర్నాట‌క‌లో బంద్‌.. తిరుప‌తి బ‌స్సుపై రాళ్లతో దాడి

క‌ర్నాట‌క‌లో బంద్‌.. తిరుప‌తి బ‌స్సుపై రాళ్లతో దాడి

హైద‌రాబాద్‌: క‌ర్నాట‌క‌లో ఇవాళ బంద్ పాటిస్తున్నారు. స‌రోజ‌ని మ‌హిషి నివేదిక‌ను అమ‌లు చేయాల‌ని ఆ రాష్ట్రానికి చెందిన అనేక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  స్థానిక క‌న్న‌డీయుల‌కు ఉద్యోగాల్లో కోటా క‌ల్పించాల‌ని ప‌లు సంఘాలు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి. ప్రైవేటు, ప‌బ్లిక్ సెక్టార్ కంపెనీల్లో ఆ కోటా ఉండాల‌ని క‌న్న‌డ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  ఇవాళ బంద్ నేప‌థ్యంలో.. ఫరంగిపేట వ‌ద్ద ఓ బ‌స్సుపై రాళ్లు రువ్వారు. తిరుప‌తి నుంచి మంగుళూరు వెళ్తున్న బ‌స్సు ఆ దాడిలో ధ్వంస‌మైంది. క‌న్న‌డ ఐక్య కూట‌మి ఆధ్వ‌ర్యంలో బంద్ కొన‌సాగుతున్న‌ది. బెంగుళూర్‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో జ‌న‌జీవ‌నం స్తంభించింది. ఉద‌యం 6 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు బంద్ పాటిస్తున్నారు. ఓలా, ఊబ‌ర్ డ్రైవ‌ర్లు కూడా బంద్‌కు స‌హ‌క‌రిస్తున్నారు. బంద్ నేప‌థ్యంలో బెంగుళూరు వ‌ర్సిటీ పీజీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను మార్చింది. నిర‌స‌న‌కారుల‌తో చ‌ర్చ‌లు చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని క‌ర్నాట‌క సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప తెలిపారు. logo