Vande Bharat | కేరళలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం
Vande Bharat | తిరువనంతపురం : కేరళలో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ధృవీకరించారు. కాసర్గాడ్ నుంచి తిరువనంతపురం రైలు వెళ్తుండగా తిరునవయ - తిరూర్ మధ్య గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు
Vande Bharat | తిరువనంతపురం : కేరళలో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దీంతో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ధృవీకరించారు. కాసర్గాడ్ నుంచి తిరువనంతపురం రైలు వెళ్తుండగా తిరునవయ – తిరూర్ మధ్య గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ రైల్వేస్టేషన్లో ఏప్రిల్ 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ రైలును ప్రారంభించారు. అయితే ఈ రాళ్ల దాడిలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు పేర్కొన్నారు. ఒక కోచ్ పూర్తిగా డ్యామేజ్ అయిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వందే భారత్ రైళ్లతో పాటు మిగతా రైళ్లకు కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఏప్రిల్ 6వ తేదీన విశాఖపట్టణంలో వందే భారత్ రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. వందే భారత్ రైళ్లపై దాడులు జరగడం గత మూడు నెలల్లో ఇది మూడో ఘటన.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

