Stock Markets: స్టాక్ మార్కెట్లు కుదేల్.. ఒక్క రోజు ట్రేడింగ్‌లో సుమారు 8.5 లక్షల కోట్లు నష్టం
Stock Markets: స్టాక్‌మార్కెట్లు ఇవాళ దారుణంగా కుదేలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కసారిగా కుప్పలాయి. తాజా సమాచారం ప్రకారం ఇవాళ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సుమారు 1100 పాయింట్లు కోల్పోయింది, మరో వైపు నిఫ్టీ సుమారు 365 పాయింట్లు పడిపోయింది. దాదాపు 8 లక్షల కోట్ల మార్కెట్ నష్టపోయింది.
బాంబే: స్టాక్‌మార్కెట్లు(Stock Markets) ఇవాళ దారుణంగా కుదేలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్కసారిగా కుప్పలాయి. తాజా సమాచారం ప్రకారం ఇవాళ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సుమారు 1100 పాయింట్లు కోల్పోయింది, మరో వైపు నిఫ్టీ సుమారు 365 పాయింట్లు పడిపోయింది. ఉదయం నుంచి ట్రేడింగ్‌లో స్టాక్‌మార్కెట్లు పేలవ ప్రదర్శన కనబరిచాయి. బుధవారం ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్టాక్‌మార్కెట్లు భిన్నంగా రియాక్ట్ అయ్యాయి. రెండు స్టాక్ ఎక్సేంజీల్లో ఒక శాతం మేర ట్రేడింగ్ పడిపోయింది.
రెపో రేటు పెంచడం వల్ల ఇన్వెస్టెర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో నిఫ్టీ 22,357 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. ఆ సమయంలో నిఫ్టీ సుమారు 245 పాయింట్లు కోల్పోయింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 71,947 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. సుమారు 691 పాయింట్లు కోల్పోయింది. రెండు ఎక్సేంజీల్లో ట్రేడింగ్ పడిపోవడంతో.. మార్కెట్ నుంచి సుమారు 8.5 లక్షల కోట్లు ఆవిరైనట్లు తెలుస్తోంది.
ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఇండిగో, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి సంస్థలు సెన్సెక్స్‌లో భారీగానే నష్టపోయాయి. ఆ కంపెనీల షేర్లు సుమారు 4 శాతం మేర తగ్గాయి. ఇక ఐటీ కంపెనీలు టెక్ మహేంద్ర, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ సుమారు రెండు శాతం వృద్ధి సాయించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

