Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
Stepson Kills Stepmother | సవతి తల్లిని, సవతి కుమారుడు హత్య చేశాడు. ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర కాలిన గాయాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనగర్: సవతి తల్లిని, సవతి కుమారుడు హత్య చేశాడు. ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర కాలిన గాయాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Stepson Kills Stepmother) జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం హౌసింగ్ కాలనీలోని ఒక ఇంట్లో సవతి తల్లిపై సవతి కుమారుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించాడు.
కాగా, కేశవ్ వర్మ భార్య అయిన 40 ఏళ్ల సుష్మా దేవి మంటల్లో చిక్కుకున్నది. సహాయం కోసం అరుస్తూ ఇంటి నుంచి బయటకు పరుగెత్తింది. గమనించిన పొరుగువారు మంటలు ఆర్పి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే 70 శాతానికిపైగా కాలిన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. సుష్మా దేవి పరిస్థితి విషమంగా ఉండటంతో జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు వైద్యులు రిఫర్ చేశారు. అక్కడకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆమె మరణించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడైన సవతి కుమారుడు మోక్ష వర్మను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. సవతి తల్లికి నిప్పంటించి హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీస్ అధికారులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. కీలక సాక్ష్యాధారమైన వీడియో క్లిప్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- burns alive
- Dies
- Diesel
- Jammu
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

