Minister KTR | నేటి నుంచి కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. రాష్ట్రంలోని పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
- రెండు రోజుల పాటు హస్తినలోనే
- పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
- తేల్చకుంటే ప్రజల్లో ఎండగట్టేలా ప్రణాళిక రూపకల్పన
Minister KTR | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాల్లో అందించాల్సిన సహాయంపై కేంద్ర మంత్రులను కలువనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం కోరుతున్నది. అయినా అనేక అంశాలపై బీజేపీ ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను బలంగా వినిపించనున్నారు.
- హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణకు చేపట్టి న ఎస్సార్డీపీలో భాగంగా తలపెట్టిన సై వేల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ భూములు కావాలని రక్షణ శాఖను కోరుతున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా కేంద్రం ఏటూ తేల్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నేరుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి కంటోన్మెంట్ భూముల అంశాన్ని లేవనెత్తనున్నారు.
- రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు హోంశాఖ పరిధిలోని భూముల అవసరం ఉన్నది. ఇందుకు అవసరమైన సహకారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నది.
- వరంగల్ వద్ద ఉన్న మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కేంద్రం ఎటూ తేల్చకుండా ఊరిస్తున్నది. ఈ అంశంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేదా వీకే సింగ్‌తో సమావేశమై, స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరే అవకాశం ఉన్నది.
- పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పురీతో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మెట్రో పరిధిని మరింత విస్తరించాలని ఇప్పటికే అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. హర్దీప్‌సింగ్‌పురీతో సమావేశం సందర్భంగా ఈ విషయంపై తేల్చాలని కోరే అవకాశం ఉన్నది.
వీటితోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలపై ఆయా శాఖల కేంద్రమంత్రులను మంత్రి కేటీఆర్ కలువనున్నట్టు సమాచారం. ఒకవేళ పెండింగ్ అంశాలపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన లేదా హామీ రాకపోతే మోదీ సర్కారు వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సృష్టిస్తున్న ఆటంకాలను ప్రజలకు వివరించి, బీజేపీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్టు తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

