BJP MLA’s Staff Dies By Suicide | ప్రియురాలితో గొడవ నేపథ్యంలో.. బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో సిబ్బంది ఆత్మహత్య
BJP MLA's Staff Dies By Suicide | ప్రియురాలితో గొడవ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నివాసంలోని సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నాడు. (BJP MLA's Staff Dies By Suicide). వీడియో కాల్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
లక్నో: ప్రియురాలితో గొడవ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నివాసంలోని సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నాడు. (BJP MLA’s Staff Dies By Suicide). వీడియో కాల్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారంతా ఆ ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. లక్నోలోని బక్షీ కా తలాబ్ నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా మీడియా సెల్లో 24 ఏళ్ల శ్రేష్టా తివారీ పని చేస్తున్నాడు. ఒక మహిళతో అతడికి నాలుగేళ్లుగా పరిచయం ఉంది. అయితే ప్రియురాలైన ఆ మహిళ, తివారీ మధ్య ఇటీవల గొడవ జరిగింది.
కాగా, ఆదివారం రాత్రి వేళ బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికార నివాసం వద్ద తివారీ ఒంటరిగా ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. ఆత్మహత్యకు పాల్పడి చనిపోతున్నట్లు చెప్పాడు. దీంతో ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. అలాగే తివారీ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఫ్లాట్ వద్దకు ఆమె వెళ్లింది. లాక్ చేసి ఉన్న డోర్ వద్ద వేచి ఉంది.
మరోవైపు పోలీసులు కూడా బీజేపీ ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. లాక్ చేసి ఉన్న డోర్‌ను పగులగొట్టారు. లోపలకు వెళ్లి చూడగా తివారీ చనిపోయి ఉన్నాడు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు కోసం ఆ మహిళ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP MLA
- dies by suicide
- fight
- flat
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

