SCC Scam | ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ తనిఖీలు
SSC scam | టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్(ssc scam) లో అరెస్ట్ అయిన టీఎంసీ ఎమ్మెల్యే, బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ మాణిక్ భట్టాచార్య కార్యాలయంలో శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 11న
కోల్కతా : టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్(ssc scam) లో అరెస్ట్ అయిన టీఎంసీ ఎమ్మెల్యే, బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ మాణిక్ భట్టాచార్య కార్యాలయంలో శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 11న మాణిక్ భట్టాచార్యను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ప్రైమరీ టీచర్స్ నియామకాల కుంభంకోణం ఆరోపణలపై ఈ నెల 10న మాణిక్ భట్టాచార్యను ఈడీని ప్రశ్నించింది.
విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆయనను 14 రోజుల కస్టడీకి పంపింది. ఈ కేసులో సెప్టెంబర్ 27న టీఎంసీ ఎమ్మెల్యేను సీబీఐ విచారణకు పిలిచింది. ఆయన విచారణకు హాజరుకాలేదు. సీబీఐ సమన్లపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి.. అరెస్టు నుంచి మినహాయింపు పొందారు. అయితే, తాజాగా ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. గతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్పటి పశ్చిమ బెంగాల్ పరిశ్రమల మంత్రి, మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని సైతం అరెస్టు చేసిన విషయం విధితమే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

