త్వరలోనే డ్రోన్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ వెల్లడించింది. దూరప్రాంతాలకు వ్యాక్సిన్లు, ప్రాణం నిలబెట్టే ఔషధాలు, అత్యవసర వస్తువుల డెలివరీ కోసం వీటిని ఉపయోగిస్తామని ఈ సంస్థ తెలిపింది. వివిధ పేలోడ్స్ భరించే రకరకాల డ్రోన్స్‌ను దీనికోసం ఉపయోగిస్తామని వెల్లడించింది.
వీటిలో 0-5 కేజీలు, 5-10 కేజీలు, 10-25 కేజీలు ఇలా వివిధ పేలోడ్స్‌కు వేరు వేరు డ్రోన్స్ వాడతారట. సంస్థ లాజిస్టిక్స్ విభాగం స్పైస్‌ఎక్స్‌ప్రెస్ ఈ డ్రోన్స్ అందుబాటులోకి తీసుకొస్తుందని కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు తెలిపారు.
కాగా, బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (బీవీఎల్వోఎస్) డ్రోన్ ఆపరేషన్లు నిర్వహించడం కోసం డీజీసీఏ షార్ట్ లిస్ట్ చేసిన కంపెనీల్లో స్పైస్‌జెట్ కూడా ఒకటి.