Tomatoes | ‘స్పెషల్ టమాటా ఫోర్స్’.. ఎస్టీఎఫ్ పేరును ఇలా మార్చాలని అఖిలేష్ యాదవ్ సూచన, ఎందుకంటే?
Tomatoes | దేశంలో ప్రస్తుతం టమాటా (Tomatoes) అంశం హాట్‌టాపిక్‌గా మారింది. టమాటా ధరలు కిలో వందకుపైగా ఉండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో టమాటా చోరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మార్కెట్లోని కూరగాయల షాపు నుంచి 26 కేజీల టమాటాలు మాయమయ్యాయి.
లక్నో: దేశంలో ప్రస్తుతం టమాటా (Tomatoes) అంశం హాట్‌టాపిక్‌గా మారింది. టమాటా ధరలు కిలో వందకుపైగా ఉండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో టమాటా చోరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా మార్కెట్లోని కూరగాయల షాపు నుంచి 26 కేజీల టమాటాలు మాయమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 10న రామ్‌జీ, నయీమ్ ఖాన్ అనే కూరగాయల వ్యాపారులు రాత్రి వేళ తమ షాపులు మూసి ఇళ్లకు వెళ్లారు. మరునాడు వచ్చి చూడగా షాపులో ఉన్న 26 కేజీల టమాటాలు, 25 కేజీల మిర్చి, 8 కేజీల అల్లం చోరీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజీల్లో టమాటాలు, మిర్చి, అల్లం దొంగతనం చేసిన నిందితులను కమతా ప్రసాద్, మహ్మద్ ఇస్లాంగా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, టమాటాల చోరీకి సంబంధించిన ఈ వార్త ఉత్తరప్రదేశ్‌లోని ప్రతికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దీనిపై స్పందించారు. టమాటా చోరీ కేసులపై దర్యాప్తు జరిపే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులను ‘స్పెషల్ టమాటా ఫోర్స్’గా వ్యవహరించాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
अब ‘स्पेशल टास्क फ़ोर्स’ (एसटीएफ़) का नाम बदलकर ‘‘स्पेशल टमाटर फ़ोर्स’ कर देना चाहिए। pic.twitter.com/VIPsdU6XVh
— Akhilesh Yadav (@yadavakhilesh) July 13, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

