Viral News | న్యూఢిల్లీ: అమ్మ, అమ్మమ్మ, తండ్రి, మేనమామ..ఇలా రక్త సంబంధీకులను గుర్తు చేసుకుంటూ స్పెయిన్లోని ఓ రాకుమారుడు తన బిడ్డకు నామకరణం చేశాడు. ఆ తమ మత విశ్వాసాల్ని తెలిపే పదాల్ని కూడా చేర్చాడు. దీంతో ఆ రాయల్ బేబీ పేరు 25 పదాలు, 157 అక్షరాలతో తయారైంది.
స్పెయిన్లోని ఆల్బా రాజ్య రాకుమారుడు డ్యూక్ ఫెర్నాండో ఫిట్జ్-జేమ్స్ స్టువార్ట్, సోషియా పలాజులో దంపతులకు ఈ ఏడాది జనవరిలో బిడ్డ జన్మించింది. ఆ బిడ్డకు ‘సోఫియా ఫెర్నాండ డోలోరెస్ కయేంటానా టెరిసా ఆంజిలా డి లా క్రూజ్ మికాలా డెల్ సాంటిసిమో సక్రమెంటో డెల్ పెర్పుటూ సోకోరో డి లా సాంటిసిమా ట్రినిడాడ్ డి టోడోస్లాస్ సాంటోస్’ అని పేరు పెట్టారు.