Akhilesh Yadav | రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav | కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరానికి రాహుల్ యాత్ర చేరుకోగా.. అఖిలేష్ యాదవ్ యాత్రలో పాల్గొన్నారు.
Akhilesh Yadav: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరానికి రాహుల్ యాత్ర చేరుకోగా.. అఖిలేష్ యాదవ్ యాత్రలో పాల్గొన్నారు.
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న కీలక ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవే కావడం గమనార్హం. ఇప్పటివరకు రాహుల్ యాత్రలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలెవరూ అఖిలేష్ యాదవ్ స్థాయిలో లేరు. ఇటీవల పశ్చిమబెంగాల్ మీదుగా రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర సాగింది. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతాబెనర్జీ యాత్రలో పాల్గొనలేదు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల పంపకం విషయంలో సమాజ్‌వాది-కాంగ్రెస్ పార్టీల మధ్య కొద్ది రోజులపాటు కొనసాగిన ప్రతిష్ఠంభనకు ఇటీవలే తెరపడింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శ ప్రియాంకాగాంధీ సమాజ్‌వాది పార్టీ ఆఫర్ చేసిన 17 సీట్లకు అంగీకారం తెలుపడంతో ఆ ప్రతిష్ఠంభనకు ఫుల్స్టాప్ పడింది. ఈ క్రమంలో ఇవాళ రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

