Lok Sabha Elections | పరివారాలకే విజయహారం.. మోదీ వాదనకు చెక్‌పెట్టిన ప్రజలు
కుటుంబ పాలన.. కుటుంబ పాలన.. నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఇదే రాగం ఎత్తుకున్నారు. అయితే మోదీ వాదన తప్పంటూ ప్రజలు ఒకే కుటుంబాలకు చెందిన వారిని ఓట్లు వేసి గెలిపించారు. తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు జైవీర్‌రెడ్డి ఇప్పటికే నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన ఇంకో కుమారుడు రఘువీర్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలిచారు.
- కుటుంబాలకే ఓటర్ల మద్దతు
- తెలంగాణలో 15 మంది చట్టసభ సభ్యులు బంధువులే
- ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఐదుగురు
- కింజారపు, యనమల కుటుంబాల నుంచి చెరో నలుగురు విజయం
- అఖిలేశ్ యాదవ్ కుటుంబం నుంచీ నలుగురు గెలుపు
Lok Sabha Elections | న్యూఢిల్లీ, జూన్ 5: కుటుంబ పాలన.. కుటుంబ పాలన.. నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఇదే రాగం ఎత్తుకున్నారు. అయితే మోదీ వాదన తప్పంటూ ప్రజలు ఒకే కుటుంబాలకు చెందిన వారిని ఓట్లు వేసి గెలిపించారు. తెలంగాణలో మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు జైవీర్‌రెడ్డి ఇప్పటికే నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన ఇంకో కుమారుడు రఘువీర్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలిచారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సోదరుడు మల్లు రవి నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలిచారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తండ్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే, పెదనాన్న వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఖమ్మం ఎంపీగా గెలిచిన రామసహాయం రఘురామిరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వియ్యంకుడు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కాగా, ఆయన కూతురు కావ్య వరంగల్ ఎంపీగా గెలిచారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచిన డీకే అరుణ మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, మేనకోడలు పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సోదరులు అన్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఆరుగురు
ఏపీలో ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి ఎంపీగా, కుమారుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా, అల్లుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా, మనవడు నారా లోకేశ్ ఎమ్మెల్యేగా, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఎంపీగా గెలిచారు. దేశవ్యాప్తంగా చట్టసభల్లోకి అడుగుపెడుతున్న పెద్ద కుటుంబం ఎన్టీఆర్‌దే. కింజారపు కుటుంబంలో నలుగురు చట్టసభల్లోకి వెళ్తున్నారు. అటు.. యనమల రామకృష్ణుడు కుటుంబంలోనూ నలుగురు నెగ్గారు.
అఖిలేశ్ యాదవ్ ఇంట్లో నలుగురు
ఇక, దేశ రాజకీయాలను పరిశీలిస్తే.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇంట్లో నలుగురు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. బీహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ కుమార్తెలిద్దరిలో మీసాభారతి గెలుపొందారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు జేడీఎస్ నేత కుమారస్వామి, దేవెగౌడ అల్లుడు, బీజేపీ అభ్యర్థి మంజునాథ్ భారీ ఆధిక్యంతో గెలిచారు.
సుప్రియా సూలే వర్సెస్ సునేత్రా పవార్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ తన వదిన సుప్రియ సూలేపై పోటీ చేసి ఓడిపోయారు.
సుజాత మండల్ వర్సెస్ సౌమిత్ర ఖాన్: వీరిద్దరు మాజీ భార్యాభర్తలు. సుజాత మాండల్ టీఎంసీ నుంచి పోటీ చేయగా, సౌమిత్ర ఖాన్ బీజేపీ నుంచి బెంగాల్‌లోని బిష్ణుపూర్ సీటులో పోటీ చేశారు.
కల్యాణ్ బెనర్జీ వర్సెస్ కబీర్ శంకర్ బోస్: కల్యాణ్ బెనర్జీ, కబీర్ శంకర్ బోస్ ఒకప్పుడు మామాఅల్లుళ్లు. కల్యాణ్ బెనర్జీ టీఎంసీ నుంచి, కబీర్ శంకర్ బోస్ బీజేపీ నుంచి సెరాంపూర్ నియోజకవర్గంలో బరిలో నిలిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

