న్యూఢిల్లీ : నోరూరించే వంటకాల ఘుమఘుమలు లేనిదే హోలీ వేడుకలు సంపూర్ణం కావు. రంగుల పండగకు ముందు దేశవ్యాప్తంగా పలు కుటుంబాలు కాంజీ వడ, దహి వడ, థండై వంటి వంటకాలను సిద్ధం చేశాయి. హోలీని సెలబ్రేట్ చేసుకునేందుకు పలు రాష్ట్రాల్లో ప్రజలు గుజియాను తయారుచేస్తుంటారు. ఈ డిష్‌తో తమ ఇరుగుపొరుగు వారు బంధుమిత్రులతో పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.
ఇక సౌత్ కొరియన్ చెఫ్ గుజియా డిష్ తయారు చేసి అందరికీ హోలీ శుభాకాంక్షలు చెబుతున్న వీడియో (Viral Video) తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చెఫ్ కిమో జియోల్ గుజియాలను తయారు చేసే విధానాన్ని వివరిస్తున్న ఈ క్లిప్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
హోలీ రోజు తినేందుకు స్పెషల్ స్వీట్ గుజియాను తయారు చేస్తున్నానని అందరికీ హోలీ శుభాకాంక్షలు అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. కొరియన్ చెఫ్ కుకింగ్ నైపుణ్యాలను నెటిజన్లు మెచ్చుకున్నారు. డిష్‌కు మెరుగైన రేటింగ్ ఇచ్చిన యూజర్లు ఆయనకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
Read More :