న్యూఢిల్లీ : రైల్వేశాఖ వివిధ విభాగాల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్స్లో అగ్నివీర్లకు 15శాతం రిజర్వేషన్లు అమలుజేయనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి. మూడు అగ్నివీర్ బ్యాచ్లకు వయో పరిమితి సడలింపు, శారీరక దారుఢ్య (ఫిజికల్ ఫిట్నెస్) పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుందని సదరు వర్గాలు తెలిపాయి.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లోనూ రిజర్వేషన్లు ఉంటాయని పేర్కొంది. రైల్వే రిక్రూటింగ్ ఏజెన్సీలు చేపట్టే అన్ని నియామకాల్లో అగ్నివీర్లకు రిజర్వేషన్లు అమలుజేయాలని జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డ్ లేఖలు జారీచేసినట్టు సమాచారం.