Sonia Gandhi: రేపు ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేతలతో సోనియాగాంధీ భేటీ
Sonia Gandhi:

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ( Sonia Gandhi ) రేపు ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ మేరకు సోనియాగాంధీ రాష్ట్ర నేతలను ఢిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై సోనియాగాంధీ పార్టీ నేతలతో చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఎంతమంది నేతలు సిద్ధంగా ఉన్నారు..? వారిలో ఎవరిని తీసుకోవాలి.. ఎవరిని తీసుకోవద్దు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ రెబల్స్‌గా పనిచేసినవాళ్లలో ఎంతమంది పార్టీలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు..? వాళ్లలోనూ తీసుకోవాల్సింది ఎవరిని.. తీసుకోకూడనిది ఎవరిని అనే అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగనుంది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో విపత్తు నిర్వహణ పనులపై కూడా సోనియా రాష్ట్ర నేతలతో సమీక్షించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

