Snowcream Dessert : మనం అసలు ఊహించని పదార్ధాలు ఊహకందని టెక్నిక్స్‌తో కూడిన వైరల్ ఫుడ్ వీడియోలు నెట్టింట సందడి చేస్తుంటాయి. ఆ కోవలో లేటెస్ట్ ఫుడ్ రీల్స్ ఇన్‌స్టాగ్రాంను షేక్ చేస్తోంది. స్నోక్రీమ్ మేకింగ్ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన ఇంటి బయట అప్పుడే పడిన తాజా మంచుతో ఓ వ్యక్తి వినూత్న డెజర్ట్‌ను తయారుచేస్తుండటం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది.
ఈ రకంగా మంచును భోంచేయడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మంచును ఇలా తినడమేంటి అసలు ఆరోగ్యం గురించి ఆలోచించారా అని కొందరు నెటిజన్లు విరుచుకుపడగా మరికొందరు పాజిటివ్‌గా రియాక్టయ్యారు. ఇన్‌స్టా రీల్లో ఓ వ్యక్తి తన ఇంటి బయట ఉంచిన టేబుల్ నుంచి అప్పుడే కురిసిన మంచును ఓ వ్యక్తి సేకరించడం కనిపిస్తుంది.
View this post on Instagram
A post shared by Jimmy Proffitt | The Appalachian Tale (@theappalachiantale)
ఆపై పెద్ద బౌల్లో స్నోను వేసి తాను సిద్ధం చేసుకున్న పదార్ధాల నుంచి షుగర్, ఎవాపరేటెడ్ మిల్క్, వెనీలాను బౌల్లో ఉన్న స్నోతో మిక్స్ చేస్తాడు. తాను చాలాసార్లు ఈ స్నోక్రీమ్ను తిన్నానని, తాను చిన్నగా ఉన్నప్పుడు తన తల్లి ఈ డెజర్ట్‌ను రెడీ చేసేదని గుర్తుచేసుకున్నాడు. ఈ క్రీమ్‌లో చాక్లెట్ సిరప్, చాక్లెట్ చిప్స్ లేదా ఓరియో బిస్కెట్స్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు ఏకంగా 1.8 కోట్ల వ్యూస్ లభించాయి.
Read More :