Snake bite: పాము కాటుకు బలైన వ్యక్తి.. అతని చితిమీదే ఆ సర్పం సజీవ దహనం
Snake bite: పాము కాటుకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్థులు ఆ పామును పట్టుకున్నారు. ఆ వ్యక్తి అంత్యక్రియల ఊరేగింపు సమయంలో దాన్ని తాడు కట్టి లాక్కెళ్లారు. అతని చితి మీద దాన్ని సజీవంగా కాల్చేశారు.
కోర్బా: చత్తీస్‌ఘడ్‌లో ఓ వ్యక్తి పాము కాటు(Snake bite)కు బలయ్యాడు. అయితే ఆ పామును చంపిన గ్రామస్థులు.. దాన్ని అతని చితిమీద పేర్చి కాల్చారు. ఈ ఘటన కోర్బా జిల్లాలో జరిగింది. శనివారం 22 ఏళ్ల దిగేశ్వర్ రథియా అనే వ్యక్తిని ఓ విషపూరిత పాము కాటు వేసింది. బైగామర్ గ్రామంలో అతను ఇంట్లో రాత్రి పడుకునే సమయంలో పాము కాటుకు గురయ్యాడు. అయితే అతన్ని కోర్బా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి.. ఆదివారం ఉదయం మరణించారు. ఈలోగా ఇంట్లో కాటేసిన పామును స్థానికులు పట్టుకున్నారు.
ఆదివారం ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో.. పామును అతని చితిమీద పేర్చారు. ఆ మంటల్లో పామును కాలి బూడిదైంది. మరెవరినైనా కాటు వేస్తుందో అన్న భయంతో.. గ్రామస్థులు దాన్ని పట్టుకుని .. చితిమంటల్లో వేసేశారు. అంత్యక్రియల ఊరేగింపు సమయంలో పామును తాడుకు కట్టేసి లాక్కెళ్లుతున్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దిగేశ్వర్ ఇంటి నుంచి అతన్ని దహనం చేసిన ప్రదేశం వరకు పామును కూడా లాక్కెళ్లారు.
ఆ వ్యక్తి చితిమంటల్లోనే ఆ సర్పం సజీవంగా ప్రాణాలు విడిచింది. ఈ ఘటన పట్ల కోర్బా సబ్ డివిజినల్ ఆఫీసర్ అశిష్ ఖేల్వార్ స్పందించారు. పామును చంపిన గ్రామస్థులపై ఎటువంటి చర్యలు తీసుకోబోమన్నారు. పాములు, పాము కాటుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు ఆశిష్ ఖేల్వార్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

