Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం..!
Smit Machchhar | ఫ్లైదుబాయ్ (Flydibai) విమానం పైలట్ స్మిత్ మచ్చర్ (Smit Machchar) కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సర్కారు నుంచి అరుదైన గౌరవం దక్కింది. విమానం కూల్చివేత ప్రయత్నాన్ని వీరోచితంగా అడ్డుకుని ప్రయాణికుల ప్రాణాలు కాపాడినందుకు యూఏఈ అత్యున్నత పురస్కారం ఇచ్చింది.
Smit Machchhar : ఫ్లైదుబాయ్ (Flydibai) విమానం పైలట్ స్మిత్ మచ్చర్ (Smit Machchar) కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సర్కారు నుంచి అరుదైన గౌరవం దక్కింది. విమానం కూల్చివేత ప్రయత్నాన్ని వీరోచితంగా అడ్డుకుని ప్రయాణికుల ప్రాణాలు కాపాడినందుకు యూఏఈ అత్యున్నత పురస్కారం ఇచ్చింది. ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారాన్ని ప్రకటించింది. మచ్చర్తోపాటు ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఫ్లైట్ సిబ్బందినీ యూఏఈ సత్కరించింది.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున యూఏఈ ఉప ప్రధాని, దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ అల్ మక్తూమ్ ఈ అవార్డును మచ్చర్‌కు ఇచ్చారు. కాగా సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ బయల్దేరిన విమానం కాక్‌పిట్‌లో పైలట్ స్మిత్ మచ్చర్‌పై కోపైలట్ దాడి చేశాడు. ఈ ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్ర రక్తస్రావమై కంటిచూపు మసకబారినా కెప్టెన్ ధైర్యాన్ని కోల్పోకుండా 170 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కాపాడాడు.
కాగా, ఇజ్రాయెల్ సర్కారు సైతం మచ్చర్‌కు ఆ దేశ అత్యున్నత శౌర్య పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ను ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం..!
Neeraj Yadav: ఏషియన్ పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య
Ranabaali | ‘రణబాలి’ నుంచి మనసును హత్తుకునే ‘కారు నిసలే’ వీడియో సాంగ్ విడుదల!
Nani and Anjana | ‘బ్లాక్‌బస్టర్’ సంసారానికి 14 ఏళ్లు.. నాని-అంజు జంటకు అభిమానుల శుభాకాంక్షలు!
Cyclone Arnab | తీరం దాటిన అర్నబ్ తుపాను.. తీవ్ర తుపానుగా మరికొన్ని గంటలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

