హాస్పిటల్లో చేరిన కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ
90 ఏళ్ల ఎస్ఎం కృష్ణ తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోశ వ్యవస్థ సపోర్ట్‌పై ఆయన ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ శనివారం అర్ధరాత్రి వేళ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. 90 ఏళ్ల ఎస్ఎం కృష్ణ తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోశ వ్యవస్థ సపోర్ట్‌పై ఆయన ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మణిపాల్ హాస్సిటల్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.
కాగా, పాత మైసూరు ప్రాంతంలోని మద్దూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎస్ఎం కృష్ణ, 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతరం 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించారు. 2017లో కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన బీజేపీలో చేరారు.
మరోవైపు కాఫీ చైన్, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, దివంగత వీజీ సిద్దార్థతో ఎస్ఎం కృష్ణ కుమార్తె మాళవిక వివాహం జరిగింది. అయితే వ్యాపారంలో నష్టాల వల్ల సిద్దార్థ ఆత్మహత్యతో ఆమె కుంగిపోలేదు. మాళవిక ధైర్యంగా కాఫీ డే సంస్థను నిర్వహిస్తున్నది. ఆ కంపెనీకి ఉన్న ఏడు వేల కోట్లకుపైగా అప్పుల్లో సగం వరకు తీర్చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

