Zika Virus | పుణెలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భిణులకు పాజిటివ్
మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తున్నది. వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యవిభాగం అప్రమత్తమయ్యింది.
పుణె: మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తున్నది. వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యవిభాగం అప్రమత్తమయ్యింది. వైరస్ వ్యాప్తి నివారణకు పుణె మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలో మొదటి కేసు నమోదయింది. 46 ఏండ్ల డాక్టర్ తొలుత జికా వైరస్ బారిపడ్డారు. అనంతరం అతని కుమార్తె (15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిద్దిరితోపాటు ముండ్వాకు చెందిన ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. ఈ నాలుగురితోపాటు అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

