న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్‌స్టర్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని గాయకుడు హర్దేశ్ సింగ్ అలియాస్ హనీ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన మేనేజర్‌కు వాయిస్ మెసేజ్‌లతో పాటు ఫోన్ కాల్స్ చేసి, రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. హనీ సింగ్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.