ఇంకా దొరకని 14 మంది జవాన్ల ఆచూకీ
సిక్కింలో ఇటీవల ఆకస్మికంగా సంభవించిన వరదల నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఆ రాష్ట్రంలో ఇంకా వరద సహాయ చర్యలు, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది.
- కొనసాగుతున్న సహాయక చర్యలు
గ్యాంగ్‌టక్, అక్టోబర్ 8: సిక్కింలో ఇటీవల ఆకస్మికంగా సంభవించిన వరదల నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఆ రాష్ట్రంలో ఇంకా వరద సహాయ చర్యలు, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సిక్కింలోని మంగన్ జిల్లా లాచెన్, లాచంగ్ లోయలోకి వచ్చిన మూడు వేల మంది పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు.
తొలుత వారు కూడా గల్లంతయ్యారని భావించారు. అయితే వారంతా క్షేమంగానే ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. వీరిని హెలికాప్టర్ ద్వారా తరలించడానికి ప్రయత్నించినా, వాతావరణం అనుకూలించ లేదు. కాగా, సిక్కిం వరదల్లో 55 మంది మరణించగా, అందులో 8 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. ఇంకా 14 మంది జవాన్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. 140 మంది వరదల్లో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

