Hijab Ban | హిజాబ్‌పై యూటర్న్ తీసుకున్న సీఎం సిద్ధరామయ్య
Hijab Ban | హిజాబ్ నిషేధంపై ప్రకటన చేసిన 24 గంటలు గడవకముందే సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నారు. తాను అలాంటి ప్రకటన చేయలేదని, అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని శనివారం పేర్కొన్నారు.
Hijab Ban | బెంగళూరు : హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న మైసూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నామని, ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధం ఉండదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
హిజాబ్ నిషేధంపై ప్రకటన చేసిన 24 గంటలు గడవకముందే సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నారు. తాను అలాంటి ప్రకటన చేయలేదని, అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని శనివారం పేర్కొన్నారు. నిన్న మైసూర్ పర్యటన సందర్భంగా హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తేస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను మేం ఇంకా ఉపసంహరించుకోలేదు. హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆలోచిస్తున్నామని, దానిపై చర్చలు జరిపి, ఆపై ఖరారు చేస్తామని తాను బదులిచ్చానని సిద్ధరామయ్య చెప్పారు.
మహిళలు తమకు నచ్చిన దుస్తులను ధరించొచ్చు. అది వారి హక్కు అని సీఎం శుక్రవారం పేర్కొన్నారు. ప్రధాని మోదీ పదేపదే వ్యాఖ్యానించే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఉట్టి బోగస్ మాటలు అని ధ్వజమెత్తారు. దుస్తులు, కులాల ఆధారంగా ఈ దేశ ప్రజలను, సమాజాన్ని బీజేపీ విభజిస్తోందని మండిపడ్డ సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

