Shraddha Murder case | శ్రద్ధా హత్య కేసులో 3 వేల పేజీల ఛార్జిషీట్.. ఈ నెలాఖరులో దాఖలు చేసే అవకాశం
శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాపై ఛార్జిషీట్ సిద్ధమైంది. దాదాపు 3 వేల పేజీలతో రెడీగా ఉన్న ఈ ఛార్జిషీట్‌ను నిపుణులు సమీక్షిస్తున్నారు.
Shraddha Murder case | ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై పోలీసులు 3 వేల పేజీల ఛార్జిషీట్‌ను సిద్ధం చేశారు. ఈ ముసాయిదా చార్జిషీట్లో 100 మందికి పైగా వాంగ్మూలాలు ఉన్నాయి. నెలరోజుల పాటు చేపట్టిన విచారణలో సేకరించిన కీలకమైన ఎలక్ట్రానిక్, ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు ఇందులో పొందుపరిచారు.
శ్రద్ధను హత్య చేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకోవడంతోపాటు అతనికి చేసిన నార్కో పరీక్ష రిపోర్ట్, ఫోరెన్సిక్ టెస్ట్ రిపోర్ట్‌లను కూడా పోలీసులు ఛార్జ్ షీట్లో ఉదహరించారు. ఈ ఛార్జిషీట్‌ను న్యాయ నిపుణులు సమీక్షించిన అనంతరం ఈ నెలాఖరులోగా కోర్టులో దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అఫ్తాబ్‌పై 3 వేల పేజీల చార్జిషీట్‌ను జనవరి చివరి వారంలో దాఖలు చేయనున్నారు. ఇందులో ఛతర్పూర్ అడవుల్లో లభించిన శ్రద్ధా ఎముకలు, వాటి డీఎన్ఏ నివేదికను కూడా పోలీసులు ప్రస్తావించారు. వీటితో పాటు కోర్టుకు అందజేయనున్న హత్య ఒప్పుకోలు, నార్కో టెస్ట్ నివేదికలకు కోర్టులో పెద్దగా ప్రాధాన్యం ఉండదని పోలీసు వర్గాల ద్వారా సమాచారం. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ అడవుల్లో జనవరి 4న లభించిన వెంట్రుకలు, ఎముకల నమూనాలు శ్రద్ధా నమూనాలతో సరిపోలినట్లు పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
గత ఏడాది మే 18న శ్రద్ధా వాకర్‌ను అఫ్తాబ్ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఈ ముక్కలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి ఆ తర్వాత పలు ప్రాంతాల్లో విసిరేశాడు. పోలీసులు అఫ్తాబ్‌ను అరెస్టు చేసి మెహ్రౌలీ అడవుల్లో శ్రద్ధా ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. 28 ఏండ్ల అఫ్తాబ్ పూనావాలా గతేడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. శ్రద్ధా వాకర్‌ను క్షణికావేశంలో చంపినట్లు అఫ్తాబ్ గతంలో ఢిల్లీ కోర్టుకు తెలియజేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

