Black fungus : తిరగబెడుతున్న బ్లాక్ ఫంగస్!
బ్లాక్ ఫంగస్! | దేశంలో కరోనా సెకండ్ వేవ్ పంజా విసిరిగింది. వైరస్‌తో పాటు పలు రకాల ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి.. ప్రస్తుతం థర్డ్ వేవ్ భయాల

ఆగ్రా : దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. వైరస్‌తో పాటు పలు రకాల ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి.. ప్రస్తుతం థర్డ్ వేవ్ భయాల మధ్య ఆగ్రాలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బ్లాక్ ఫంగస్ బారినపడి కోలుకున్న తొమ్మిది మందికి మళ్లీ ఫంగస్ సోకింది. అయితే, ఈ సారి బాధితుల్లో లక్షణాలు కనిపించకపోవడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఊరట కలిగించే విషయమేంటంటే.. రోగులను దవాఖానాల్లో అడ్మిట్ చేసుకోకుండా.. యాంటీ ఫంగల్ మందులపై చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో బ్లాక్ ఫంగస్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డును కొనసాగిస్తున్నారు. ఆగ్రాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి 98 మంది రోగులు వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందారు. తర్వాత ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గినా.. రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు దవాఖానా వార్డు నోడల్ అధికారి డాక్టర్ అఖిల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. గతంలో ఫంగస్ బారినపడి చికిత్స పొందిన తొమ్మిది మందిలో ఇటీవల మళ్లీ ఫంగస్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ సారి రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఎంఆర్ఐ పరీక్షలు చేయగా.. ఫంగస్ ఆనవాళ్లు కనిపించాయి.
మళ్లీ ఎందుకు సోకుతోంది?
బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ సోకడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, రోగులందరూ మధుమేహ పరీక్షలు చేయించుకున్న సమయంలో.. షుగర్ నియంత్రణలో లేదని తేలింది. ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం, సరైన సమయంలో మందులు వేసుకోకపోవడమే ఫంగస్ మళ్లీ సోకడానికి కారణమని పేర్కొంటున్నారు. ఫంగస్ బారినపడిన రోగులు సంయమనం పాటించాలని, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలన్నారు.
ఎస్ఎన్ మెడికల్ కాలేజీలోని బ్లాక్ ఫంగస్ వార్డులో ఇప్పటి వరకు 98 మంది రోగులు చికిత్స పొందగా.. 14 మంది రోగులను మరణించారు. చాలా మంది రోగుల్లో దవడలు, కళ్లను తొలగించారు. అయితే, గత నెల రోజుల్లో కొత్త కేసులు గుర్తించలేదు. ఫంగస్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే.. చికిత్స అంత విజయవంతమవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలని, స్టెరాయిడ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తే.. తక్కువ మోతాదులో ఇవ్వాలని, అనవసర వాడకాన్ని నివారించాలని పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
Rashad hussain । అంబాసిడర్‌గా భారతీయ అమెరికన్ రషద్ హుస్సేన్
Covid Vaccine for kids । పిల్లలపై టీకా ట్రయల్స్‌కు బయోలాజికల్-ఈకి అనుమతి నిరాకరణ
పని చేసిన బ్యాంక్‌కే కన్నం.. అడ్డువచ్చినందుకు అసిస్టెంట్ మేనేజర్ హత్య!
Covid-19 । దేశంలో కొత్తగా 41,649 కరోనా కేసులు
శివకాశి పటాకుల కర్మాగారంలో పేలుడు.. ఒకరు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

