Narayan Rane: శివసేనలో నన్ను విమర్శించేవాళ్లకు ఉన్నత పదవులు: కేంద్రమంత్రి
Narayan Rane: బీజేపీ చేపడుతున్న జన్ ఆశీర్వాద్ యాత్రకు రాష్ట్రంలో భంగం కలిగించడానికే శివసేన పార్టీ తనను అరెస్ట్ చేయించిందని కేంద్రమంత్రి నారాయణ్ రాణే చెప్పారు. ఆ పార్టీలో తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని

ముంబై: బీజేపీ చేపడుతున్న జన్ ఆశీర్వాద్ యాత్రకు రాష్ట్రంలో భంగం కలిగించడానికే శివసేన పార్టీ తనను అరెస్ట్ చేయించిందని కేంద్రమంత్రి నారాయణ్ రాణే చెప్పారు. ఆ పార్టీలో తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ప్రోత్సహిస్తూ ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని రాణే ఆరోపించారు. జన్ ఆశీర్వాద్ యాత్ర పదో రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణే మాట్లాడుతూ.. ‘జన్ ఆశీర్వాద్ యాత్రలో ఒక చెడ్డ శకునం. తమను తాము రాష్ట్రపతిగా ఊహించుకొనే కొందరు మంత్రులు నన్ను అరెస్టు చేయించారు. నా యాత్రను ఆపాలనుకున్నారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ప్రోత్సహిస్తూ శివసేన వారికి అధికారాలు కట్టబెడుతోంది’ అన్నారు.
‘నా యాత్రను కొనసాగిస్తా. మహారాష్ట్రలోని ప్రతి ఒక్క జిల్లాలో పర్యటిస్తా. కేంద్రం అందించే పథకాలను ప్రజలకు వివరిస్తా. భాజపాలో చేరాలనుకునే వారిని స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా’ అని మంత్రి రాణే పేర్కొన్నారు. ‘దేశ ప్రధాని ఆలోచన నుంచి పుట్టిందే జన్ ఆశీర్వాద్ యాత్ర. ఆయన నాకు కేబినేట్ పదవిని ఇచ్చి ప్రజల ఆశీర్వాదం తీసుకోమన్నారు. ముంబై నుంచి చేపట్టిన యాత్ర పదో రోజు కొనసాగుతోంది. ఈ రోజు సింధుదుర్గ్‌లో ఉన్నా. ఇప్పటికీ కొంతమంది ఈ యాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయినా కొన్ని వేల మంది జనం నాతో కలిసి వస్తున్నారు’ అని రాణే పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

