Shirdi Sai Baba Temple | షిర్డీ సాయిబాబా భక్తులకు అలెర్ట్..! ఇక ఆలయంలోకి ఈ వస్తువులు తీసుకెళ్లడంపై నిషేధం..!
Shirdi Sai Baba Temple | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. బాబా ఆలయంలోకి పూల దండలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలను తీసుకెళ్లడంపై నిషేధం విధించింది.
Shirdi Sai Baba Temple | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. బాబా ఆలయంలోకి పూల దండలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలను తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థాన్ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. భక్తులు ఆలయంలోకి వెళ్లే ముందు క్షుణ్ణంగా తనిఖీలు చేయనున్నారు. ఇప్పటి వరకు భక్తులు తాము కొనుగోలు చేసిన ప్రసాదాలు, ఫొటోలు, శాలువాలతో పాటు బాబాను అలకరించేందుకు పూలు తీసుకెళ్లేందుకు అనుమతి ఉండేది. ఇదిలా ఉండగా.. ఏటా బాబా దర్శనానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
అయితే, గతవారం కింద ఆలయానికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆలయానికి దండలు, పుష్పాలు, శాలువాలు తీసుకెళ్లడానికి అనుమతించకూడదని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యుడు గోరక్ష్ గడిల్కర్ మాట్లాడుతూ ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. మే 2న ట్రస్ట్‌కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని ఆయన చెప్పారు. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, హెచ్చరికల నేపథ్యంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. అహలయనగర్ జిల్లా పోలీసులు ఆలయంలో భద్రతను పెంచేందుకు పలు సూచనలు చేశారు. ఇదిలా ఉండగా.. ముంబయిలోని సిద్ధివినాయక ఆలయం సైతం మే 11 నుంచి ఆలయంలోకి దండలు, ప్రసాదం, కొబ్బరికాయలను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

