Shinzo Abe | నేతాజీ 2022 అవార్డు జపాన్ మాజీ ప్రధాని జింజో అబేను వరించింది. ఈ విషయాన్ని నేతాజీ రీసెర్చ్ బ్యూరో ప్రకటించింది. నేతాజీ 125 వ జయంతిని పురస్కరించుకొని ఎల్గిన్ రోడ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో కోల్కతాలోని జపాన్ కాన్సుల్ జరనల్ నకమౌరా యుటాకా మాజీ ప్రధాని అబే తరపున ఈ అవార్డును అందుకున్నారు. జపాన్ మాజీ ప్రధాని అబే నేతాజీకి గొప్ప ఆరాధకుడని నేతాజీ మనుమడు, నేతాజీ రీసెర్చ్ బ్యూరో డైరెక్టర్ సుగతా బోస్ ఈ సందర్భంగా అభివర్ణించారు.