Sheena Bora Case | షీనా బోరా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు జనవరి 5 నాటి సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచి కోర్టుకు సమర్పించాలని గువాహటి ఎయిర్పోర్ట్ అధికారులను ఆదేశించింది. విమానాశ్రయంలో షీనా బోరాలా ఉన్న యువతిని తాను చూశానని ఇంద్రాణి ముఖర్జియా వేసిన పిటిషన్‌పై గురువారం ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ ఫుటేజీని తీసుకోవాలని ఇంద్రాణి జనవరి 6న ప్రత్యేక సీబీఐ కోర్టును కోరారు.
మరోవైపు ఇంద్రాణి ముఖర్జీ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం కౌంటర్ సమాధానం ఫైల్ చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో షీనాబోరా కనిపించిందంటూ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, షీనా బోరా ఇప్పటికే మృతి చెందినందున పిటిషన్‌పై దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలున్నాయని, కేసు సాక్షి శ్యావర్ రాయ్ సైతం వాంగ్మూలం ఇచ్చారని చెప్పింది. ఈ క్రమంలో గువాహటి విమానాశ్రయానికి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. షీనా బోరాలా కనిపించే అమ్మాయికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కోర్టు ముందుంచాలని నోటీసుల్లో కోర్టు కోరింది.
సీబీఐ వివరాల ప్రకారం.. షీరాబోరా (24) ఇంద్రాణి ముఖర్జీ, ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ మధ్య సంజీవ్ ఖన్నా 2012లో ఏప్రిల్‌లో కదులుతున్న కారులో గొంతునులిమి హత్య చేశారు. మృతదేహాన్ని పొరుగునే ఉన్నా రాయ్‌గఢ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో కాల్చివేసినట్లు ఆరోపణలున్నాయి. ఇంద్రాణి మాజీ భర్త పీటర్ ముఖర్జీల కూతురే ఈ షీనాబోరా. 2015లో మరో కేసులో శ్యాంవర్ రాయ్ అరెస్టయ్యాక ఈ హత్య వెలుగులోకి వచ్చింది. ఇంద్రాణి ముఖర్జీ భర్త, మాజీ మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జీ కూడా కుట్రలో భాగమయ్యారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2020లో ఆయనకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణికి సైతం గత ఏడాది మేలో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.